
శ్రీదేవి కూతురిగా ఎంట్రీ ఇచ్చినా… మొదటి సినిమాకి అద్భుతమైన స్పందనేమీ దక్కలేదు. జాన్వీకపూర్ కి. ఆమె నటించిన ‘ధడక్’ సినిమా యావరేజ్ గానే ఆడింది. జాన్వీ బాగానే చేసినా, మరింత మెప్పిస్తే బాగుండేదన్న కామెంట్స్ వినిపించాయి. వాటన్నింటినీ పాజిటివ్ గా తీసుకున్న జాన్వీ, తర్వాతి సినిమా కోసం సిన్సియర్ గా కష్టపడుతోంది. ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ కోసం ప్రాణం పెట్టి పనిచేస్తోంది. మరోపక్క రాజ్ కుమార్ రావ్ తో ఓ హారర్ సినిమా కమిటైంది. సినిమాల సంగతి అలా ఉంచితే… ఒక విషయానికి తరచూ వార్తల్లో కి వస్తూ ఉంటుంది జాన్వీ. అది ఆమె డ్రెస్సింగ్. ఫంక్షన్లకు తల్లి తరహాలో అద్భుతంగా రెడీ అయ్యే జాన్వీ… మిగతా సమయాల్లో ఎప్పుడు కెమెరాకి చిక్కినా సింపుల్ దుస్తుల్లో ఉంటుంది. పైగా వేసిన డ్రెస్సే మళ్లీ మళ్లీ వేసుకుంటూ ఉంటుంది. ఈవిషయమై రీసెంట్ గా ఒకరు నేరుగా అడిగేశారు.దానికి నొచ్చుకోలేదు జాన్వీ. ‘రోజుకో డ్రెస్ వేసుకునేంత స్తోమత నాకు లేదు, నేనింకా అంత సంపాదించట్లేదు’ అంటూ సూటిగా చెప్పేసింది. సంపన్నుల కూతురు వేసిన డ్రెస్సే వేయడమేంటని అనుకుంటారంతా. అందుకే నా సంపాదనతో నేను బతకాలనుకుంటున్నానని చెప్పకనే చెప్పిందన్నమాట.