
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీం కోర్టులో గట్టి షాక్ తగిలింది. హేమంత్ సోరెన్ ను ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. సోరెన్ ను పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు హైకోర్టులో పిటీషన్ వేయగా విచారణ జరిపించిన సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. భూకుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ బుధవారం నాడు అరెస్ట్ అయ్యారు. రాంచీలో బుధవారం మధ్యాహ్నం నుంచి విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రాత్రి 9.33 గంటలకు అదుపులోకి తీసుకున్నారు.