న్యూయార్క్: మిస్టర్ బీస్ట్‌గా పాపులర్ అయిన ఫేమస్ యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్‌సన్ మామూలోడు కాడు. అమెరికా నార్త్ కరోలినాలోని ఒక ఏరియాలో ఐదు ఇండ్లను కొనిపారేశాడు. తనకు, తన కుటుంబానికి, తన ఉద్యోగుల కోసం వీటిని కొన్నాడు. న్యూయార్క్ పోస్ట్ ద్వారా ఈ సంగతి తెలిసింది. మిస్టర్ బీస్ట్ 25 ఏళ్ల మిలియనీర్. యూట్యూబ్‌లో మనోడికి చాలా ఫాలోయింగ్ ఉంది. ఒక్కో వీడియోను దాదాపు కోటి మంది దాకా చూస్తారట. స్టంట్ వీడియోలు, భారీ-బడ్జెట్ ప్రొడక్షన్ వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి.
బీస్ట్ జనానికి డబ్బులు ఉచితంగానూ ఇవ్వడంతో పాపులారిటీ మరింత పెరిగింది. ప్రపంచంలో అత్యధికంగా సబ్స్క్రిప్షన్లు సాధించిన యూట్యూబర్‌లలో బీస్ట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. నార్త్ కరోలినాలోని గ్రీన్‌విల్లే సమీపంలోని కల్-డి-సాక్‌లో ఐదు ఇళ్లను కొన్నాడు. తన మొదటి ఇంటిని 2018లో 3,20,000 డాలర్లకు దక్కించుకున్నాడు. ఆ తరువాత పొరుగున ఉన్న ఇతర ఇళ్లను కొన్నాడు.