జియో సినిమా యూజర్స్కు గుడ్ న్యూస్.. ఇకనుండి యూనివర్సల్ కంటెంట్‌‌ కూడా

జియో సినిమా యూజర్స్కు గుడ్ న్యూస్.. ఇకనుండి యూనివర్సల్ కంటెంట్‌‌ కూడా

ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమా కొత్తగా ప్రకటించిన జియో సినిమా ప్రీమియం SVOD టైర్‌లో వచ్చే నెల నుంచి NBCU సంస్థకు చెందిన కంటెంట్ ను కూడా ప్రసారం చేయనుంది. ఈ మేరకు NBC యూనివర్సల్, జియో సినిమా, Viacom18 స్ట్రీమింగ్ సర్వీస్లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్ లో NBCUకు సంబంధించిన సినిమాలు, టీవీ సిరీస్‌లను జియో సినిమా ప్రసారం చేయనుంది.

ఇందులో భాగంగా యూనివర్సల్ టెలివిజన్, యూనివర్సల్ టెలివిజన్ ఆల్టర్నేటివ్ స్టూడియో, UCP, యూనివర్సల్ ఇంటర్నేషనల్ స్టూడియోస్, డ్రీమ్‌వర్క్స్ యానిమేషన్, స్కై స్టూడియోస్, యూనివర్సల్ పిక్చర్స్,  ఫోకస్ ఫీచర్స్, బ్రావో సంస్థల కంటెంట్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది జియో సినిమా. ఈ కంటెంట్ లాంచ్ లో జియో సినిమా హాలీవుడ్ స్టూడియో సహకారం అందించనుంది. జియో సినిమా ప్రీమియం సినిమాల స్ట్రీమింగ్ ఈ స్టూడియో నుంచే జరగనుంది. 

ఇతర ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ తో పోల్చుకుంటే జియో సినిమా ప్రీమియం సంవత్సరానికి కేవలం రూ.999 మాత్రమే. దీంతో NBCU కంటెంట్ కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది కాబట్టి వినియోగదారులు కూడా జియో సినిమా వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది.