
మంత్రి కేటీఆర్ సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా జిట్టాకు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉద్యమ కాలంలో జిట్టా పార్టీకి ఎంతో సేవ చేశారని మంత్రి తెలిపారు. యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు బాలకృష్ణారెడ్డి తోడుగా ఉన్నారన్నారు. ఉద్యమ నేతలు అందరూ తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు.
కొందరు నేతలు మాయమాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. జిట్ట బాలకృష్ణ రెడ్డి పార్టీ వీడకపోతే భువనగిరి ఎమ్మెల్యేగా పైల్ల శేఖర్ రెడ్డి ఉండేవారు కాదని మంత్రి కేటీఆర్ అన్నారు.
అనంతరం జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తనను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే ఉద్యమ నాయకులకు, జేఏసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా ఆయన అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.
అయితే గతంలో బీఆర్ఎస్ లో యువజన విభాగం అధ్యక్షుడిగా పని చేసిన జిట్టా 2009లో భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే టికెట్ రాకపోవడంతో పార్టీని వీడారన్న సంగతి తెలిసిందే.