2724 మందితో జేఎల్ పికప్ లిస్టు

2724 మందితో జేఎల్ పికప్ లిస్టు
  • ఆగస్టు 5 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జూనియర్ లెక్చరర్ల భర్తీకి మరో ముందడుగు పడింది. ఇప్పటికే జేఎల్ ఫలితాలు రిలీజ్ చేయగా, తాజాగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పికప్ లిస్టునుప్రకటించింది. 1,392 పోస్టులకు గానూ మొత్తం 27 సబ్జెక్టుల్లో 2,724 మందిని ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 11 వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది.  

సాధార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ అభ్యర్థులను 1:2 రేషియోలో, పీడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్ల్యూడీ అభ్యర్థులను 1:5 రేషియోలో స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్టిఫికెట్ వెరిఫికేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలిచింది. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 13 వరకూ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని కమిషన్ ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా పికప్ లిస్టుతో పాటు మరిన్ని వివరాలకు http://www.tspsc.gov.in వెబ్ సైట్  చూడాలని సూచించింది.