వనపర్తిలో జేఎన్టీయూ క్యాంపస్

వనపర్తిలో జేఎన్టీయూ క్యాంపస్

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు 45 ఎకరాల్లో స్థలాన్ని పరిశీలించామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీ, బైపాస్ రోడ్డు తదితర పనులకు స్థలాన్ని జిల్లా కలెక్టర్, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల బృందంతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఆఫీసులో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టబోయే వివిధ కాలేజీల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పనులు చేపడతామని, భూసేకరణ సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎకో పార్క్ లో సీఎం స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ దొబ్రియాల్, మహబూబ్ నగర్ ఫారెస్ట్ కన్జర్వేటర్ క్షితిజ, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి మొక్కలు నాటారు.