రోడ్ సేఫ్టీపై ‘సర్వేజన’తో జేఎన్టీయూ ఎంవోయూ

రోడ్ సేఫ్టీపై ‘సర్వేజన’తో జేఎన్టీయూ ఎంవోయూ

కూకట్​పల్లి, వెలుగు: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో శుక్రవారం జేఎన్టీయూ, సర్వేజన ఫౌండేషన్ మధ్య ఎంవోయూ కుదిరింది. జేఎన్​టీయూ వైస్​ చాన్స్​లర్​ డాక్టర్​ టి.కిషన్​కుమార్​రెడ్డి, సర్వేజన ఫౌండేషన్​ ప్రతినిథి, రిటైర్డ్​ ఐఏఎస్​ డాక్టర్​ బి.జనార్ధన్​రెడ్డి ఎంవోయూపై సంతకాలు చేశారు. 

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించటానికి అవగాహన కల్పించడమే ఎంవోయూ ఉద్దేశ్యమన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్​ కె.వెంకటేశ్వరరావు, అకడమిక్​ అండ్​ ప్లానింగ్​ డైరెక్టర్​ డాక్టర్​ వి.కామాక్షిప్రసాద్​, సర్వేజన ఫౌండేషన్​ సీఈవో ప్రవీణ్​కుమార్​ పాల్లొన్నారు.