స్వప్పలోక్ బిల్డింగ్ భవితవ్యంపై GHMCకి జేఎన్టీయూ నివేదిక

 స్వప్పలోక్ బిల్డింగ్ భవితవ్యంపై GHMCకి జేఎన్టీయూ నివేదిక

పటిష్టంగా రినోవేట్ చేశాకే స్వప్పలోక్  బిల్డింగ్ ను  తెరవాలని  జేఎన్టీయూ సూచించింది.   స్వప్పలోక్ బిల్డింగ్ భవితవ్యంపై జీహెచ్ఎంసీకి జేఎన్టీయూ నివేదిక ఇచ్చింది.  జీహెచ్ఎంసీ కమిషనర్ కు  15  పేజీల రిపోర్ట్ ఇచ్చింది టెక్నికల్ టీం.  స్వప్పలోక్ బిల్డింగ్ ను  పూర్తిగా కూల్చాల్సిన అవసరం లేదని  సూచించారు. ప్రమాదం జరిగిన 4, 5, 6 ఫ్లోర్లను రినోవేట్ చేస్తే సరిపోతుందన్నారు. మరి జీహెచ్ఎంసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. 

మార్చి 16న స్వప్పలోక్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో  ఆరుగురు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సెల్లార్​లో వైర్లు కాలి 4, 5, 6 ఫ్లోర్లలో మంటలు చెలరేగాయి. ఐదో అంతస్తులోని ఆరుగురు సిబ్బంది  అగ్నికి తాళలేక ఓ రూమ్​లోకి వెళ్లి దాక్కున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లే సరికి.. వాళ్లంతా రూమ్​లో స్పృహ తప్పిపడిపోయారు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పొగకు ఊపిరాడక చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మృతులను ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి,ప్రశాంత్​, శివగా గుర్తించారు.  వీళ్లలో ఐదుగురి వయసు 22 నుంచి 25 ఏండ్లులోపే ఉంటుంది. 

 స్వప్న లోక్ కాంప్లెక్స్ 8 అంతస్తుల్లో ఉంది. 1 నుంచి 5వ ఫ్లోర్ వరకు ఆఫీసులు కాగా.. 6 నుంచి 8వ ఫ్లోర్ వరకు బట్టల షాపులున్నాయి. ఈ ప్రమాదాన్ని  సుమోటోగా స్వీకరించి విచారించిన హైకోర్టు ... ప్రతివాదులుగా సీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, అగ్నిమాపక శాఖ డీజీ చేర్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కొరింది