జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (JNUSU) ఎన్నికల్లో లెఫ్ట్ వింగ్ ఘనవిజయం సాధించింది. నాలుగు కీలక స్థానాలను లెఫ్ట్ యూనిటీ కైవసం చేసుకుంది. నవంబర్ 4న నిర్వహించిన JNU విద్యార్థి సంఘాల ఎన్నికల్లో 9వేల043 మంది విద్యార్థులకు ఓటు హక్కు ఉండగా.. 67 శాతం పోలింగ్ నమోదు అయింది.
ప్రతిష్టాత్మకంగా భావించే JNU విద్యార్థి సంఘాల ఎన్నికల్లో వామపక్ష కూటమి విజయం సాధించింది.గురువారం ( నవంబర్6) ఉత్కంఠత సాగిన ఓట్ల లెక్కింపులో అధ్యక్ష, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ పదవులతోపాటు పలు కౌన్సిలర్లను దక్కించుకుంది. గత ఎన్నికల్లోనూ లెఫ్ట్‌కూటమి ఆధిపత్యం చూపగా ABVP దశాబ్దం తర్వాత జాయింట్ సెక్రటరీ స్థానాన్ని గెలుచుకుంది.
దేశవ్యాప్తంగా విద్యార్థి రాజకీయాలపై JNU ఎన్నికల ప్రభావం ఉంటుంది. సామాజిక న్యాయం, మహిళా సమానత్వం, విద్యా హక్కులు వంటి అంశాలు విద్యార్థుల చర్చల్లో ప్రధానంగా వినిపించాయి. హాస్టల్ సదుపాయాలు, ఫీజు పెంపు వ్యతిరేకత, మహిళా భద్రత వంటి సమస్యలు కూడా ప్రధాన చర్చా విషయాలుగా మారాయి. ఈ క్రమంలో వామపక్ష కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. గత ఎన్నికల్లోనూ లెఫ్ట్‌వింగ్ హవా కొనసాగింది.
2025 JNU స్టూడెంట్స్ యూనియన్ (JNUSU) ఎన్నికల్లో లెఫ్ట్ యూనిటీ పార్టీ మరోసారి విజయం సాధించింది. నాలుగు సెంట్రల్ స్థానాలను వామపక్ష అభ్యర్థులు గెలుచుకున్నారు. ABVP తుడిచిపెట్టుకుపోయింది.
చైర్మన్:
వామపక్ష కూటమికి చెందిన అదితి మిశ్రా 1,861 ఓట్లతో చైర్మన్ గా గెలుపొందారు. ABVPకి చెందిన వికాస్ పటేల్ (1,447 ) ను ఓడించారు.
వైస్ చైర్మన్:
కె. గోపిక 2,966 ఓట్లను సాధించి వామపక్షాలకు నిర్ణయాత్మక విజయాన్ని అందించగా..ABVPకి చెందిన తాన్య కుమారి 1,730 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు.
సెక్రటరీ జనరల్:
ఈ పదవికి పోటీ హెూరాహెూరీగా సాగింది.చివరికి వామపక్షానికి చెందిన సునీల్ యాదవ్ ABVPకి చెందిన రాజేశ్వర్ కాంత్ దూబేను ఓడించారు. సునీల్ యాదవు 1,915 ఓట్లు రాగా, రాజేశ్వర్ కాంత్ దూబేకు 1,841 ఓట్లు వచ్చాయి.
జాయింట్ సెక్రటరీ:
జాయింట్ సెక్రటరీ పదవికి డానిష్ అలీ 1,991 ఓట్లతో గెలుపొందారు.ABVPకి చెందిన అనుజ్ డమారాకు 1,762 ఓట్లు వచ్చాయి.
జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (JNU)లో విద్యార్థి సంఘ ఎన్నికలు నవంబర్ 4న జరిగాయి. అక్టోబర్ 23న విడుదలైన షెడ్యూల్, తుది అభ్యర్థుల జాబితా అక్టోబర్ 28న విడుదలైంది. ఈసారి లెఫ్ట్ యూనిటీ వింగ్ (AISA, DSF, SFI), రైట్ వింగ్ ABVP మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో లెఫ్ట్‌కూటమి ఆధిపత్యం చూపగా ABVP దశాబ్దం తర్వాత జాయింట్ సెక్రటరీ స్థానాన్ని గెలుచుకుంది. ఈసారి కూడా ఇరువైపుల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 30 శాతం మంది మహిళా అభ్యర్థులు ఉండటం ప్రత్యేకతగా నిలిచింది.
