
కరీంనగర్ టౌన్,వెలుగు: సికింద్రాబాద్‌లో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసులో గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 3గంటల వరకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ తిరుపతిరావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్‌మేళాలో హైదరాబాద్ లోని సీతారామ్ స్పిన్నర్స్ ప్రై.లిమిటెట్ కంపెనీలో 300 మెషిన్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు.
అర్హత,ఆసక్తి కలిగిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం 90631 73935లో సంప్రదించాలని తెలిపారు.