వికారాబాద్, వెలుగు: శుభ సంపద డెవలపర్స్‌లో ఉద్యోగాల కోసం వికారాబాద్‌లోని ఐటీఐ క్యాంపస్ ఆవరణలో గల జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈ నెల 4న ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ ప్రకటించారు.
వందకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని.. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. వివరాల కోసం 9676047444 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
