8 మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 

8 మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఎనిమిది  మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్(డీఎంఈ) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా (http://dme.telangana.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అక్టోబర్ 31న సెలక్షన్ లిస్ట్ ప్రకటిస్తామని, నవంబర్ ఏడో తేదీలోగా ఉద్యోగాల్లో జాయిన్ కావాల్సి ఉంటుందని పేర్కొంది. మొత్తం 15 డిపార్ట్‌‌‌‌మెంట్లలో ఖాళీలు ఉన్నట్టు చూపించారు. కానీ, ఖాళీల సంఖ్య ఎంతో ప్రకటించలేదు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి చెందినవాళ్లైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు కానీ, తెలంగాణ అభ్యర్థులు దొరక్కపోతేనే, ఇతర రాష్ట్రాల వాళ్లను సెలెక్ట్ చేస్తామని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌కు రూ.1.9 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌కు రూ.1.5 లక్షలు, అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌కు రూ.1.25 లక్షల వేతనం ఇవ్వనున్నారు. ఉద్యోగాల కాలపరిమితి ఏడాది మాత్రమేనని, ఇది పూర్తిగా కాంట్రాక్ట్ రిక్రూట్‌‌‌‌మెంట్ అని నోటిఫికేషన్‌‌‌‌లో స్పష్టం చేశారు. వనపర్తి, నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌, మహబూబాబాద్‌‌‌‌, కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండంలో కొత్త కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.