ఏజ్ బార్ అవుతున్నాజాబ్స్ఇస్తలే

ఏజ్ బార్ అవుతున్నాజాబ్స్ఇస్తలే
  • హెల్త్ డిపార్ట్మెంట్లో 370 పోస్టులకు 2018లో నోటిఫికేషన్
  • మెరిట్ లిస్ట్ ప్రకటించి వదిలేసిన్రు

మెడికల్ డిపార్ట్మెంట్లోని పోస్టుల భర్తీలో టీఎస్పీఎస్సీ తీసుకున్న నిర్ణయాల వల్ల పలువురు అభ్యర్థులు సర్వీస్ పోగొట్టుకుంటున్నారు. అర్హులైనవారికి 2019లో జాబ్రావాల్సి ఉండగా.. వారంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. స్టేట్ మెడికల్ అండ్ హెల్త్డిపార్ట్మెంట్లో 370 ఖాళీల భర్తీకి 2018 జనవరి 25న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్రిలీజ్చేసింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విద్యా పరిషత్లో గ్రేడ్–2 ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్, డెంటల్ టెక్నిషియన్స్, అప్తాలిక్ అసిస్టెంట్స్ ఉద్యోగాలకు డిప్లొమాతో పాటు ఫార్మసీ పూర్తయినవారికి అవకాశం కల్పించింది. ఏజ్లిమిట్44 ఏండ్ల వరకు ఉండడంతో 12 వేల మంది పోటీ పడ్డారు. ఏప్రిల్ 17న రాష్ట్రవ్యాప్తంగా పేపర్ 1, పేపర్ 2 పద్ధతిలో ఎగ్జామ్ నిర్వహించారు. అనంతరం మెరిట్ లిస్ట్ ప్రకటించారు. మేల్, ఫిమేల్ కేటగిరిలో ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులున్నాయి, ఏ హాస్పిటల్లో ఖాళీలున్నాయి, ఏ రిజర్వేషన్ వారికి అవకాశం ఉంది.. పూర్తి వివరాలతో ర్యాంక్ లిస్ట్ ఇచ్చారు.
  
సర్వీస్ పాయింట్స్ మెలికతో.. 

టీఎస్పీఎస్సీ చేపట్టిన రిక్రూట్మెంట్లో అన్నివిధాలా మెరిట్ సాధించి ఇక రేపోమాపో జాబ్ కొడతామని అభ్యర్థులు భావిస్తున్న క్రమంలో.. ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. ఇదే విభాగంలో గతంలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నవారికి ఎక్స్పీరియన్స్ ఆధారంగా 20 నుంచి 30 సర్వీస్ మార్కులు కలపనున్నట్లు చెప్పారు. దీంతో మొదట ప్రకటించిన లిస్టులో 100 నుంచి 150లోపు మెరుగైన ర్యాంక్ వచ్చినవారికి సర్వీస్ పాయింట్స్ కలిపాక ఇచ్చిన రెండో లిస్ట్ లో 350 నుంచి 400 పైకి ర్యాంక్ వెళ్లింది. దీంతో బాధితులంతా ఆందోళన చేపట్టారు. అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేశారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో అవకతవకలు జరుగుతున్నాయంటూ పలువురు కోర్టుకు వెళ్లారు. అప్పట్లో చివరి అవకాశంగా 44 ఏండ్ల వయసులో అప్లై చేసుకున్నవారి వయసు ఇప్పుడు 46 దాటుతోంది. ఇప్పటికిప్పుడు వారికి జాబ్స్ ఇచ్చినా మరో 14 ఏండ్లలో రిటైర్మెంట్ తీసుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందనే విమర్శలున్నాయి. కేవలం నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం.. ఈ డిపార్ట్మెంట్లో పలువురికి జాబ్స్ ఇచ్చినట్లు ఎలక్షన్ల టైంలో ప్రచారం చేసుకోవడమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.