
భారత ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) ఇంజినీర్స్/ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 21.
పోస్టులు: ఇంజినీర్స్/ ఆఫీసర్స్ (గ్రేడ్ –ఏ)
ఎలిజిబిలిటీ: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 65 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో బి.టెక్ లేదా బీఈ పూర్తి చేసి ఉండాలి.
కెమికల్ ఇంజినీరింగ్ పోస్టులకు కెమికల్, కెమికల్ టెక్నాలజీ, కెమికల్ అండ్ బయోకెమికల్, పెట్రోకెమ్ ఇంజినీరింగ్, పెట్రోకెమికల్ ఇంజినీరింగ్, పెట్రోకెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమ్ అండ్ పెట్రోలియం రిఫైనరీ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పోస్టులకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
(పవర్ సిస్టమ్), ఎలక్ట్రికల్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్ అండ్ పవర్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్ అండ్ పవర్), ఎలక్ట్రికల్ ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ పవర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
►ALSO READ | PJTSAU Jobs: ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్శిటీలో ఉద్యోగాలు భర్తీ
ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ పోస్టులకు ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇనుస్ట్రుమెంట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, ఇనుస్ట్రుమెంటేషన్ ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ ఇనుస్ట్రుమెంట్ అండ్ కంట్రోల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 26. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 01.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 21.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), గ్రూప్ డిస్కషన్ (జీడీ) అండ్ గ్రూప్ టాస్క్ (జీటీ), పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అడ్మిట్ కార్డ్స్: అక్టోబర్ 17.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: అక్టోబర్ 31.
పూర్తి వివరాలకు iocl.com వెబ్సైట్లో
సంప్రదించగలరు.
సీబీటీ ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ బేస్డ్ టెస్టులో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సెక్షన్–ఏలో డొమైన్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, సెక్షన్–బిలో జనరల్ ఆప్టిట్యూడ్ విభాగంలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు 20 మార్కులకు, లాజికల్ రీజనింగ్ 15 ప్రశ్నలు 15 మార్కులు, వర్బల్ ఎబిలిటీ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ 15 ప్రశ్నలు 15 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
జీడీ, జీటీ, పీఐకు అర్హత
కంప్యూటర్ బేస్డ్ టెస్టులో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు సెక్షన్–ఏ, బీలో 40 శాతం మార్కులు మొత్తంగా 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు సెక్షన్-–ఏ, బీలో 35 శాతం మార్కులు మొత్తంగా 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు సెక్షన్-ఏ, బీలో 25 శాతం మార్కులు మొత్తంగా 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఫైనల్ మెరిట్ లిస్ట్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు 85 శాతం, గ్రూప్ డిస్కషన్ (జీడీ) అండ్ గ్రూప్ టాస్క్ (జీటీ)కు 5 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూ (పీఐ)కు 10 శాతం వెయిటేజీతో ఫైనల్ మెరిట్ఈ లిస్ట్ రూపొందిస్తారు. వీటిలో కనీస అర్హత జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ 40 శాతం, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.