టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా బిడెన్-హారిస్‌ల జంట

టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా బిడెన్-హారిస్‌ల జంట

ఒక క్యాలండ‌ర్ ఇయర్‌లో అధిక ప్ర‌భావం చూపిన వ్య‌క్తుల‌కు టైమ్ మ్యాగజైన్ ‘ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్’అవార్డుతో స‌త్క‌రిస్తుంది. ఈ ఆనవాయితీ 1927 నుంచి ప్రతి ఏటా వస్తుంది. ఈ సంవత్సరం 2020కి గానూ ఆ అవార్డుకు యూస్ ప్రెసిడెంట్‌, వైస్ ప్రెసిడెంట్‌గా కొత్తగా ఎన్నుకోబడిన జో బిడెన్ మరియు కమలా హారీస్‌లు ఎంపికయ్యారు. ఈ అవార్డు కోసం హెల్త్ కేర్ వర్కర్స్ మరియు జాతికి సంబంధించిన ఉద్యమ నాయకుడు ఆంథోనీ ఫౌసీతో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా పోటీపడ్డారు. కానీ టైమ్ మ్యాగజైన్ మాత్రం బిడెన్, కమలా హారిస్‌ల జంటను ఎంపిక చేసింది. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన తన కొత్త కవర్‌ పేజీ మీద జో బిడెన్ మరియు కమలా హారీస్‌ల ఫోటోను ముద్రించింది. ఆ ఫోటోకు ‘చేంజింగ్ అమెరికన్స్ స్టోరీ’అనే ఉపశీర్షికను జతచేశారు.

మొన్న జరిగిన అధ్యక్ష ఎన్నికలలో జో బిడెన్‌కు 306 ఓట్లు రాగా.. ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలలో రిప‌బ్లిక‌న్ నేత ట్రంప్ క‌న్నా బిడెన్‌కు సుమారు 7 మిలియన్ల ఓట్లు అధికంగా పోల‌య్యాయి. కానీ, ట్రంప్ మాత్రం ఇంకా తన ఓటమిని అంగీకరించలేదు.

టైమ్ మ్యాగజైన్ గురువారం అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌గా బాస్కెట్‌బాల్ సూపర్ స్టార్ లెబ్రాన్ జేమ్స్‌ను ఎంపికచేసింది. అదేవిధంగా ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్‌గా బీటీఎస్‌ టీంను ఎంపికచేసింది. ఈ టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డును 2016లో క్లైమెట్ చేంజ్ ఆక్టివిస్ట్ గ్రెటా థన్‌బెర్గ్ గెలుచుకుంది.

For More News..

గంజాయి నూనె అమ్ముతున్న ఇద్దరు విద్యార్థులు అరెస్ట్

అమీర్ పేట్‌లో ఘోర ప్రమాదం.. మెట్రో గ్రిల్‌లో తల ఇరుక్కొని యువకుడు మృతి

దొరగారికి తెలంగాణ అంటే ఆ రెండు ప్రాంతాలేనా?