యూఎస్ మిలటరీ అటాక్ చేస్తది: తాలిబన్లకు బైడెన్ వార్నింగ్

యూఎస్ మిలటరీ అటాక్ చేస్తది: తాలిబన్లకు బైడెన్ వార్నింగ్

వాషింగ్టన్‌: అఫ్గానిస్తాన్‌లో రోజు రోజుకూ తన బలం పెంచుకుంటూ దూసుకెళ్తున్న తాలిబన్లకు అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ వార్నింగ్ ఇచ్చారు. అఫ్గాన్‌కు సాయం చేసేందుకు మరిన్ని అమెరికా బలగాలను పంపుతామని చెప్పారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యూఎస్ బలగాలు సహకరిస్తాయని, ఈ మిషన్‌ను అడ్డుకుంటే సీరియస్‌గా రియాక్ట్ అవుతామని తాలిబన్లను బైడెన్ హెచ్చరించారు. అఫ్గాన్‌లో సహాయ చర్యల కోసం ప్రస్తుతం 3 వేల మంది అమెరికా సోల్జర్స్ ఉన్నారని, ఇప్పుడు 5 వేల మందికి పెంచాలని నేషనల్ సెక్యూరిటీ టీమ్‌ జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకునన్నామని తెలిపారు.

యూఎస్ మిలటరీ అటాక్ చేస్తది

అఫ్గాన్‌లో యూఎస్ బలగాలకు గానీ, తమ దేశ చేపడుతున్న ఏ మిషన్‌కు గానీ తాలిబన్లు ఎటువంటి ఇబ్బంది లేదా హాని తలపెట్టినా తాము ఊరుకోబోమని బైడెన్ హెచ్చరించారు. తమపై ఎటువంటి దాడి జరిగినా యూఎస్ మిలటరీ స్ట్రాంగ్ అటాక్‌కు దిగుతుందని వార్నింగ్ ఇచ్చారు. అఫ్గాన్‌లోని అన్ని ప్రధాన నగరాలను ఇప్పటికే తాలిబన్లు ఆక్రమించిన నేపథ్యంలో బైడెన్ ఇటువంటి ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు అఫ్గాన్‌లో పరిస్థితులపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి ఫోన్ చేసి మాట్లాడారు. దేశంలో హింసను కంట్రోల్ చేసేందుకు తీసుకోవాల్సిన రాజకీయ, దౌత్య పరమైన చర్యలపై వారిద్దరూ చర్చించినట్టు ఆంటోనీ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు.