జోబైడెన్ పాలనా సిబ్బందిలో సగం మంది ఇండో – అమెరికన్లే

జోబైడెన్ పాలనా సిబ్బందిలో సగం మంది ఇండో – అమెరికన్లే

జనవరి 20న అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జోబైడెన్ తో పాటు పాలనా సిబ్బందిలో ఎక్కువ మంది ఇండో – అమెరికన్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కమలా హ్యారీస్ అమెరికా ఉపాధ్యక్ష  పదవి స్వీకరింస్తుండగా.., నీరా టాండన్ సెక్రటరీగా,  ఇండో-అమెరికన్ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి.. బైడెన్-హ్యారిస్ కోవిడ్-19  టాస్క్ ఫోర్స్ కో-చైర్మెన్ గా నియమితులయ్యారు. ఇందులో డాక్టర్ సెలెన్ గౌండర్, డాక్టర్ అతుల్ గవాండే కూడా భాగమయ్యారు. వివేక్ మూర్తి కుటుంబం కర్ణాటకకు చెందినవారు. గౌండర్ తమిళనాడు మూలాలు కలిగిన వ్యక్తి. బైడెన్-హ్యారిస్ కోవిడ్-19 టాస్క్ ఫోర్స్  లో వీరు కాకుండా చాలా మంది ఇండో-అమెరికన్లు పలు పదవుల చేపట్టనున్నారు. గూగుల్ మాజీ ఎగ్జిక్యూటీవ్ డాక్టర్ అర్జున్ మజూందార్.. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ కి నేతృత్వం వహించనున్నారు. డాక్టర్ రాహుల్ గుప్తా నేషనల్ డాక్టర్ కంట్రోల్ పాలసీలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.

ఇదే విధంగా కిరణ్ అహుజా.. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్, మాలా అడిగా ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్, పావ్నీత్ సింగ్ జాతీయ భద్రతా మండలికి పోలీసు డెరక్టర్ గా నియామితులయ్యారు. సీమా నందా బైడెన్-హ్యారిస్ పరిపాలనలో యూఎస్ కార్మిక శాఖలో కీలక పదవి చేపట్టనుండగా.. పునీత్ తల్వార్ యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ లో ఓ భాగంలో పనిచేయనున్నారు.