అమెరికాలో గన్ కల్చర్ ఓ అంటువ్యాధి: జో బైడెన్

అమెరికాలో  గన్ కల్చర్ ఓ అంటువ్యాధి: జో బైడెన్

కాల్పుల మోతతో అమెరికా మరోసారి వణికిపోయింది. తాజాగా మిసిసిపీలోని టేట్ కౌంటీలో ఓ దుండగుడు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు.చనిపోయిన వారిలో నిందితుడి మాజీ భార్య కూడా ఉన్నారు. దుండగుడు రెండు ఇండ్లతో పాటు ఓ సూపర్ మార్కెట్ స్టోర్ లోనూ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఇందుకోసం అతను మూడు తుపాకులను వాడాడు. నిందితుడు పారిపోతున్న వాహనాన్ని వెంబడించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

గన్ వయలెన్స్ ఆర్కైవ్ వివరాల ప్రకారం అమెరికాలో ఈ ఏడాది కాల్పుల ఘటన చోటు చేసుకోవడం ఇది 73వసారి. ఈ ఘటనపై స్పందించిన ప్రెసిడెంట్ జో బైడెన్.. ఇక చాలు అని అన్నారు. ఈ ఏడాదిలో 48 రోజుల్లోనే 73 కాల్పుల ఘటనలు నమోదుకావడంపై విచారం వ్యక్తం చేశారు. గన్ కల్చర్ ఓ అంటువ్యాధి అన్న బైడెన్ దాన్ని అరికట్టేందుకు తుపాకీ చట్టంలో సంస్కరణలు అవసరమని ఓ ప్రకటన రిలీజ్ చేశారు.