ఫేక్ సమాచారంతో  జనాల్ని చంపుతున్నరు

ఫేక్ సమాచారంతో  జనాల్ని చంపుతున్నరు

వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ల గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ సోషల్ మీడియా కంపెనీలు జనాల్ని చంపేస్తున్నాయని అమెరికా ప్రెసిడెంట్​జో బైడెన్ మండిపడ్డారు. వ్యాక్సిన్ల గురించి తప్పుడు సమాచారంతో ప్రజారోగ్యానికి ప్రమాదమని యూఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి కామెంట్ చేసిన మరుసటి రోజే బైడెన్ స్పందించారు. ఇటు వ్యాక్సిన్ వేయించుకుంటే మరణాలు, అనారోగ్యం బారిన పడబోరని యూఎస్ అధికారులు కూడా చెబుతున్నారు. బైడెన్ మాట్లాడుతూ..  ఫేస్‌బుక్ సహా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై ఫైర్ అయ్యారు. ‘మనం గుర్తించలేని ఏకైక మహమ్మారి వారి(సోషల్‌ మీడియా)లోనే ఉంది. వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారంతోనే చాలామంది టీకాలు తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. సోషల్‌ మీడియాతోనే అసలైన ముప్పు పొంచి ఉంది. వారే జనాల్ని చంపుతున్నారు..’ అని విరుచుకుపడ్డారు. మరోవైపు ఫేస్​బుక్ వీటన్నింటినీ తోసిపుచ్చింది. ఫేస్‌‌బుక్‌‌ ప్రతినిధి డాని లివర్ స్పందిస్తూ.. వాస్తవానికి 2 బిలియన్లకు పైగా ప్రజలు వ్యాక్సిన్లపై అధికారిక సమాచారాన్ని ఫేస్​బుక్ ద్వారా వీక్షించారన్నారు. 3.3 మిలియన్లకు పైగా అమెరికన్లు టీకా ఎక్కడ ఎలా పొందాలో తెలుసుకునేందుకు తమ టీకా ఫైండర్ టూల్​ను ఉపయోగించారని వివరించారు.