ఈ యువకుడు ఎవరో తెలుసా! జిన్‌‌పింగ్‌‌కు బైడెన్ ఫొటో సర్ ప్రైజ్

ఈ యువకుడు ఎవరో తెలుసా! జిన్‌‌పింగ్‌‌కు బైడెన్ ఫొటో సర్ ప్రైజ్

శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికా పర్యటనలో  ఉన్న  చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌‌పింగ్‌‌కు యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ వరుసగా సర్ ప్రైజ్ లతో షాక్ ఇస్తున్నారు. ఆ సర్ ప్రైజ్ లకు జిన్‌‌పింగ్‌‌ హాయిగా నవ్వుతూ తబ్బిబ్బు అవుతున్నారు. శనివారం ఓ కార్యక్రమంలో బైడెన్ తన ఫోన్ లో ఓ ఫొటోను చూపిస్తూ "ఈ యువకుడు ఎవరో మీకు తెలుసా?" అని జిన్‌‌పింగ్‌‌ను అడిగారు. 

దాన్ని చూసిన చైనా ప్రెసిడెంట్ ఆశ్చర్యపోయారు. చిరునవ్వుతో  'ఓ యస్(తెలుసు)' అంటూ బదులిచ్చారు. అది తన 38 ఏండ్ల క్రితం నాటి ఫొటో అని చెప్పారు. అప్పట్లో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో లోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వద్ద ఆ  ఫొటో దిగినట్లు బైడెన్ కు వివరించారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను  చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్ యింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దానికి జిన్‌‌పింగ్‌‌ పాత ఫొటోను జతచేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇప్పటివరకు ఈ ఫొటో 11 లక్షల వ్యూస్ తోపాటు7,500 కంటే ఎక్కువ లైక్‌‌లను పొందింది. పాత ఫొటోలో జిన్‌‌పింగ్‌‌ బాగున్నాడంటూ కొందరు యూజర్లు కామెంట్ చేయగా.. చైనా, అమెరికా ప్రెసిడెంట్ల మధ్య స్నేహం ప్రపంచానికి మంచి చేస్తుందని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.