ఈయన ' రూటే' సపరేటు..

ఈయన ' రూటే' సపరేటు..

వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్  జో రూట్ మరోసారి టెస్టుల్లో నెంబర్ ప్లేస్ను దక్కించుకున్నాడు. ఏడాదిన్నర కాలంలో ఏకంగా పది టెస్టు సెంచరీలతో కదం తొక్కి రూట్...తాజాగా న్యూజీలాండ్ తో జరుగుతున్న  సిరీస్లో వరుసగా రెండు టెస్టుల్లోనూ భారీ సెంచరీలతో చెలరేగాడు. అంతేకాకుండా టెస్టుల్లో పది వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. దీంతో  ఐసీసీ ప్రకటించిన  తాజా టెస్టు ర్యాంకింగ్స్లో  ఆస్ట్రేలియా బ్యాట్స్మన్  మార్నస్‌  లబుషేన్‌ను వెనక్కి నెట్టి రూట్ టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని అధిరోహించాడు. 

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం..జో రూట్ 897 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా..లబుషేన్ 892 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 845 పాయింట్లతో థార్డ్ ప్లేస్ లో  పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం నాలుగో స్థానంలో ఉన్నారు.  ఐదోస్థానంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌  798 పాయింట్లతో కొనసాగుతున్నాడు.  అయితే త్వరలో ఇంగ్లాండ్ టీమ్.. ఇండియా,  సౌతాఫ్రికాతో టెస్టులు ఆడనున్న నేపథ్యంలో..ఇందులో మోస్తారుగా రాణించినా... జో రూట్‌  టాప్‌ స్థానంలో కొనసాగే అవకాశాలున్నాయి. 


తన టెస్టు కెరియర్ లో రూట్ మొదటి సారిగా 2015లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత 2021 డిసెంబర్ లో రెండోసారి టాప్లోకి దూసుకొచ్చాడు. టెస్టుల్లో రూట్ 163 రోజుల పాటు నెంబర్ వన్ గా కొనసాగాడు. విరాట్ కోహ్లీ 469 రోజుల పాటు టాప్లో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ 245 రోజుల పాటు అగ్రస్థానాన్ని ఎంజాయ్ చేశాడు. అయితే అందరి కంటే ఎక్కువగా స్టీవ్ స్మిత్ 1506 రోజుల పాటు టెస్టుల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగడం విశేషం. 

టీమిండియా నుంచి కెప్టె్న్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టాప్ -10లో చోటు నిలుపుకున్నారు. రోహిత్ శర్మ  754 పాయింట్లతో 8వ స్థానంలో ఉండగా..కోహ్లీ 742 పాయింట్స్ తో 10వ ప్లేస్లో నిలిచాడు.

ఇక టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే..ఆసీస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ 901 పాయింట్లతో నెంబర్ వన్ ప్లేస్లో నిలిచాడు. రెండో స్థానంలో ఆశ్విన్, మూడో స్థానంలో బుమ్రా కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో టాప్‌ 2లో భారత ఆల్ రౌండర్లే టాప్ ప్లేస్లో నిలవడం విశేషం. 385 రేటింగ్‌ పాయింట్లతో రవీంద్ర జడేజా నెం.1 స్థానాన్ని దక్కించుకోగా..341 పాయింట్లతో అశ్విన్‌ రెండోస్థానంలో ఉన్నాడు.