సోమశిల, అమరగిరిల్లో పెద్దపులి సంచారంపై పెట్రోలింగ్...

సోమశిల, అమరగిరిల్లో పెద్దపులి సంచారంపై పెట్రోలింగ్...
  • సోమశిల, అమరగిరిల్లో నిర్వహించిన ఫారెస్ట్​ ఆఫీసర్లు

కొల్లాపూర్, వెలుగు: నాగర్​కర్నూల్​జిల్లా కొల్లాపూర్ కృష్ణానది పరిసర అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుందన్న అనుమానంతో తెలంగాణ అటవీ శాఖ కొల్లాపూర్ రేంజ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆత్మకూరు రేంజ్ అధికారులు కలిసి గురువారం స్టేట్ బార్డర్ లో జాయింట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పులి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 

ముందస్తు చర్యల్లో భాగంగా సోమశిల, అమరగిరి గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళల్లో ఒంటరిగా అడవుల్లోకి వెళ్లొద్దని చెప్పారు. అనుమానాస్పద అనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కొల్లాపూర్ రేంజ్ ఆఫీసర్​మగ్ధుమ్ హుస్సేన్, సెక్షన్ ఆఫీసర్లు ముజీబ్ ఘోరీ, భయ్యన్న, నీలేశ్, ఆత్మకూరు డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు మద్దిలేటి, కావేరి, నవీన్, బేస్ క్యాంప్​సిబ్బంది పాల్గొన్నారు.