
ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎప్పుడైనా తమ మొదటి ప్రాధాన్యతను దేశానికే ఇస్తారు. కానీ కంగారూల స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పట్ల తన విధేయతను చాటుకున్నాడు. జూన్ 11 నుంచి సౌతాఫ్రికాతో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఉన్నప్పటికీ ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. తాను ఐపీఎల్ అయిపోయేవరకు ఆడతానని భరోసా ఇచ్చి ఫ్యాన్స్ కు ఖుష్ చేశాడు. ఈ సీజన్ లో ఆర్సీబీ తరపున బెస్ట్ బౌలర్ గా నిలిచిన ఈ ఆసీస్ పేసర్.. భుజం గాయం కారణంగా చివరి రెండు మ్యాచ్ లు ఆడలేదు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ కంగారు పడిపోయారు.
హాజిల్‌వుడ్ లాంటి స్టార్ ఫాస్ట్ దూరమవుతాడనే వార్తలు బెంగళూరు జట్టుతో పాటు ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేశాయి. ఇండియా-పాకిస్థాన్ ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయిన హాజిల్‌వుడ్ ఇక రావడం కష్టమే అనుకున్నారు. అయితే ఆర్సీబీ జట్టు కోసం తన మనసు మార్చుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఉన్న జోష్.. ప్లే ఆఫ్స్ కు అందుబాటులో ఉండనున్నాడు. మే 25న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో తిరిగి చేరబోతున్నాడు. ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 1 కు ముందు అతను ఆర్సీబీ జట్టులో చేరతాడు.
ALSO READ | IPL 2025: నష్టం జరిగాక రూల్ ఎలా మారుస్తారు.. బీసీసీపై KKR సీఈఓ వెంకీ మైసూర్ అసంతృప్తి
ఈ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం బ్రిస్బేన్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందుతున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించి బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. గత సంవత్సరం మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోష్ హాజిల్‌వుడ్ ను రూ.12.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టి తనపై ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ సీజన్ లో ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.
ఈ సీజన్ లో ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించగా.. టాప్ 2 పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం పటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్ ల్లో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన పటిదార్ సేన మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే టాప్ 2 లో నిలుస్తుంది. అప్పుడు ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు ఉంటాయి. మే 23 న సన్ రైజర్స్ హైదరాబాద్‌తో.. మే 27 న లక్నో సూపర్ జయింట్స్‌తో తలపడనుంది.
Good news for RCB 🔴✈
— CricXtasy (@CricXtasy) May 21, 2025
Josh Hazlewood is all set to join RCB ahead of the playoffs. ✅
(Via- Hindustan Times) pic.twitter.com/SxjQBYMcbH