అర్ణబ్‌‌ అరెస్టును ఖండించిన జర్నలిస్ట్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ తెలంగాణ

అర్ణబ్‌‌ అరెస్టును ఖండించిన జర్నలిస్ట్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ తెలంగాణ

రాజకీయ కక్షతోనే అర్ణబ్‌‌ అరెస్టు

హైదరాబాద్‌‌, వెలుగు: రాజకీయ కక్షలతోనే రిపబ్లిక్‌‌ టీవీ చీఫ్‌‌ ఎడిటర్‌‌‌‌ అర్ణబ్‌‌ గోస్వామిని అరెస్టు చేశారని జర్నలిస్ట్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ తెలంగాణ (జేఏటీ)  ప్రెసిడెంట్‌‌ పగుడాకుల బాలస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.నిజాన్ని నిర్భయంగా చెప్పే అర్ణబ్‌‌ను అరెస్ట్‌‌ చేయడం అప్రజాస్వామికమని, మీడియా సంస్థలను ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం దుర్మార్గమన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్‌‌ చేశారు. అరెస్టు చేసి ఈడ్చుకెళ్లడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు అర్ణబ్‌‌ అరెస్టును ఖండించాలని కోరారు.