హైదరాబాద్ సిటీ, వెలుగు: జర్నలిస్ట్ ముద్దం నర్సింహస్వామికి ‘బెస్ట్ ఏఐ జర్నలిజం’ అవార్డు లభించింది. హైటెక్ సిటీలో నిర్వహించిన హైబిజ్ టీవీ డిజిటల్ మీడియా అవార్డుల వేడుకలో మంత్రి అజహరుద్దీన్, మల్లారెడ్డి వర్సిటీ వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
మీడియా రంగంలో ఆధునిక ఏఐ సాంకేతికతను సమర్థంగా ఉపయోగిస్తూ, తోటి జర్నలిస్టులకు ఈ అంశంపై శిక్షణ ఇస్తున్నందుకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా నర్సింహస్వామి మాట్లాడుతూ.. ఈ అవార్డు డిజిటల్ మీడియాలో ఏఐ ప్రాధాన్యతను చాటిచెబుతోందని పేర్కొంటూ హైబిజ్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
