జర్నలిస్టులపై చిన్నచూపు తగదు: టీడబ్ల్యూజేఎఫ్ కన్వీనర్ మామిడి సోమయ్య

జర్నలిస్టులపై చిన్నచూపు తగదు: టీడబ్ల్యూజేఎఫ్ కన్వీనర్ మామిడి సోమయ్య

మెహిదీపట్నం, వెలుగు: జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) కన్వీనర్​ మామిడి సోమయ్య డిమాండ్​ చేశారు. సోమవారం ఫెడరేషన్​ ఆధ్వర్యంలో జర్నలిస్టులు మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కమిషనరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా జర్నలిస్టుల ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు. 

కనీసం అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. కోర్టు తీర్పు సాకుతో ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదన్నారు. ఆరోగ్య బీమా పథకం అటకెక్కిందన్నారు. జర్సలిస్టుల సమస్యలపై మీడియా అకాడమీ చైర్మన్ సైతం కమిటీల పేరుతో కాలయాపన చేసి చేతులెత్తేశారని విమర్శించారు. అనంతరం సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్ కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో పులిపలుపుల ఆనందం, వల్లాల జగన్, బండి విజయ్ కుమార్, తన్నీరు శ్రీనివాస్, ఆర్.వెంకటేశ్వర్లు, కుడుతాడి బాపురావు పాల్గొన్నారు.