తెలంగాణలో యూరియా కొరత లేకుండా చూస్తాం

తెలంగాణలో యూరియా కొరత లేకుండా చూస్తాం

ఢిల్లీ: తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని విధాలా సహకారం అందిస్తామని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం కేంద్ర మంత్రి ని కలిసి రా ష్ట్రానికి సరిపడా యూరియా, ఎరువులు సరఫరా చేయాలని కోరారు. స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా రైతుల అవసరాలను తీర్చడానికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

 యూరియాను వ్యవసా యేతర అవసరాలకు మళ్లించకుండా, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సమానంగా ఎరువులు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్ర భుత్వ అధికారులను కోరారు. ఇదే సమయంలో తెలంగాణలో యూరియా వినియోగం పెరుగు తుండటంపై కేంద్ర మంత్రి సడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24యాసంగితో పోలిస్తే 2024 -25 యాసంగిలో యూరియా అమ్మకాలు 21% అధికమయ్యాయని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని  కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం (జూలై 8) కేంద్ర మంత్రి నడ్డాను ఆయన నివాసంలో కలిసి విజ్ఞప్తి  చేశారు. వానా కాలం సీజ‌న్‌కు సంబంధించి ఏప్రిల్ - జూన్ మ‌ధ్య రాష్ట్రానికి 5 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల‌కు గానూ కేవలం 3.07 ల‌క్షల మెట్రిక్ ట‌న్నులు మాత్రమే స‌ర‌ఫ‌రా చేశార‌ని ఈ సందర్భంగా నడ్డా దృష్టికి తెచ్చారు సీఎం రేవంత్. ఈ క్రమంలో సీఎం రేవంత్  విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన నడ్డా తెలంగాణలో యూరియ కొరత లేకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారు.