రాహుల్ గాంధీకి సవాల్: దేశానికి వ్యతిరేంగా CAAలో రెండు లైన్లు చూపండి

రాహుల్ గాంధీకి సవాల్: దేశానికి వ్యతిరేంగా CAAలో రెండు లైన్లు చూపండి

మధ్య ప్రదేశ్: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. ఆదివారం మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన సభలో మాట్లాడిన ఆయన…. పౌరసత్వ చట్టంలో ఏముందో తెలువకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రాహుల్ గాందీ కనీసం పౌరసత్వ చట్టంలోని 10లైన్లను చదివి వినిపించాలని.. లేకపోతే దేశానికి, దేశ పౌరులకు వ్యతిరేకంగా ఉన్న రెండు లైన్లను సైతం చూపాలని నడ్డా డిమాండ్ చేశారు.  కావాలనే కాంగ్రెస్ నేతలు తమ స్వార్ధంకోసం దేశ ప్రజలను రెచ్చకొడుతున్నారని అన్నారు.

ఈ రోజు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మాట్లాడిన మోడీ… పౌరసత్వం చట్టం అనేది తాను సంకల్పించినది కాదని.. గాంధీ సంకల్పమని… దీని గురించి గతంలో మన్మోహన్ సింగ్ కూడా ప్రస్తావించారని చెప్పారు. ఇప్పుడు కావాలనే కాంగ్రెస్, టీఎంసీలు రాజకీయం చేస్తున్నాయని చెప్పారు.