హింసను ప్రేరేపించే వారికి వామపక్ష ప్రభుత్వం సపోర్ట్ !

హింసను ప్రేరేపించే వారికి వామపక్ష ప్రభుత్వం సపోర్ట్ !

కేరళలో తీవ్రవాదం ఎక్కువైందని.. ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సామాన్య ప్రజలకు ఇక్కడ భద్రతపై భరోసా కరువైందన్న ఆయన... మతపరమైన ఉద్రిక్తతలూ పెరుగుతున్నాయని ఆరోపించారు. హింసను పెంచిపోషిస్తున్న వారికి లెఫ్ట్ ప్రభుత్వం పరోక్ష మద్దతు ఇస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా కేరళలోని వామపక్ష ప్రభుత్వంపై ఆయన విమర్శలు సంధించారు. ప్రభుత్వ విషయాల్లో సీఎం కుటుంబ సభ్యుల జోక్యమూ పెరుగుతుందన్న ఆయన... కుటుంబ పార్టీల దారిలోనే వామపక్ష పార్టీ నడుస్తోందని చెప్పారు. ప్రభుత్వ కార్యాల్లో సీఎం కూతురు, అల్లుడి ప్రమేయం కనిపిస్తున్నదని ఆరోపణలు చేశారు. 

మాజీ ముఖ్యమంత్రి దేవీలాల్ జయంతిని పురస్కరించుకుని హర్యానాలో విపక్ష పార్టీ ర్యాలీని ప్రస్తావించి నడ్డా విమర్శలు చేశారు. అవన్నీ కుటుంబ పార్టీలేనని, అవినీతి ఆరోపణల్లో ఉన్న పార్టీలేనని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీ తీవ్రంగా పోరాడుతోందని నడ్డా చెప్పారు. దాంతో పాటు కేరళలో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, హింసను ప్రేరేపించే వారికి వామపక్ష ప్రభుత్వం ఇన్ డైరెక్ట్ గా మద్దతిస్తోందని విమర్శించారు.