జేపీ నడ్డా భార్య కారు చోరీ..

జేపీ నడ్డా భార్య కారు చోరీ..
  • సర్వీసింగ్ సెంటర్ నుంచి అపహరణ

న్యూఢిల్లీ :  బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డా భార్య మల్లికా నడ్డా కారు చోరీకి గురైంది. సౌత్ ఈస్ట్ ఢిల్లీలో మార్చి 19న ఈ ఘటన జరిగింది. మల్లికా నడ్డాకు చెందిన టయోటా పార్చ్యూనర్ కారుకు జోగిందర్ సింగ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆ కారు ను గోవింద్ పురి ప్రాంతంలోని సర్వీ స్ సెంటర్ కు తీసుకువచ్చాడు. తర్వా త భోజనం చేయడానికి ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి కారు చోరీకి గురైంది. జోగిందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా కారు గురుగ్రామ్ వైపు వెళ్లినట్టు అధికా రులు గుర్తించారు. అనేక ప్రయ త్నాలు చేసినప్పటికీ కారు ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభించలేదు.