Creta: హుందాయ్ క్రెటా రికార్డ్ అమ్మకాలు.. జూన్ నెలలో దేశంలోనే 'బెస్ట్ సెల్లింగ్ కార్'

Creta: హుందాయ్ క్రెటా రికార్డ్ అమ్మకాలు.. జూన్ నెలలో దేశంలోనే 'బెస్ట్ సెల్లింగ్ కార్'

Hyundai Creta: భారతీయ ప్రజలు ఎక్కువగా ఎస్ యూవీ మోడల్ కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో 2015లో భారత మార్కెట్లోకి తొలిసారిగా విడుదలైన హుందాయ్ క్రెటా తన అమ్మకాల విజయ పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా క్రెటా జూన్ 2025లో ఏకంగా 15వేల 786 యూనిట్లు అమ్ముడు కావటంతో దేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్ గా నిలిచింది. మార్చి, ఏప్రిల్ మాసాల్లో కూడా క్రెటా ఇదే అమ్మకాల దూకుడును కొనసాగించింది. 

ప్రస్తుతం ఈ మిడ్ ఎస్ యూవీ కేటగిరీలో హుందాయ్ క్రెటాకు పోటీగా మారుతీ సుజుకీ గ్రాండ్ వితారా, కియా సెల్టోస్, టాటా కర్వ్, టయోటా అర్బన్ క్రూయిజ్ హైరైజర్, హోండా ఎలివేట్, స్కోడా కుషక్, ఫోక్స్ వ్యాగన్ టైగన్, ఎంజీ అస్టర్ మోడల్స్ ఉన్నాయి. కంపెనీ ప్రస్తుతం క్రెటాలో మరింతగా కస్టమర్ అనుభూతి పెంచేలా తీర్చిదిద్దాలని చూస్తోంది. 

►ALSO READ | ఈ నెలలోనే అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది : డిస్కౌంట్స్, ఆఫర్స్ లిస్ట్ ఇదే..!

హుందాయ్ క్రెటాను లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షల భారతీయ కుటుంబాలు కొనుగోలు చేశారని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు. ఇండియాలో హుందాయ్ వ్యాపారానికి ఎస్ యూవీ అమ్మకాలు మూల స్థంభంగా నిలిచినట్లు చెప్పారు. గడచిన పదేళ్లుగా క్రెటా అమ్మకాల విజయపరంపర కొనసాగుతోందని, భారతీయ కస్టమర్లలో ఈ మోడల్ మంచి ఆదరణ, గుర్తింపును తెచ్చుకుందని గార్గ్ చెప్పారు. లాంచ్ సమయం నుంచి ప్రతి ఏటా క్రెటా మిడ్ సైజ్ ఎస్ యూవీల అమ్మకాల్లో మెుదటి స్థానంలో నిలిచిందని హుందాయ్ మోటార్స్ ఇండియా వెల్లడించింది.