ఈ నెలలోనే అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది : డిస్కౌంట్స్, ఆఫర్స్ లిస్ట్ ఇదే..!

ఈ నెలలోనే అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది : డిస్కౌంట్స్, ఆఫర్స్ లిస్ట్ ఇదే..!

Amazon Prime Day 2025: షాపింగ్ లవర్స్ సిద్ధం కండి. అమెజాన్ మరోసారి తన కస్టమర్ల కోసం అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025తో వచ్చేస్తోంది. అమెజాన్ ఇండియా తన మెగా సేల్ జూలై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి జూలై 14 రాత్రి 11.59 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 72 గంటల పాటు కొనసాగనున్న ఈ సేల్ సమయంలో తన ప్రైమ్ మెంబర్లకు భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. 

ప్రధానంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, యాక్సిసరీస్, టెలివిజన్స్, అప్లయన్సెస్, అమెజాన్ ఎకో ఉత్పత్తులపై భారీ తగ్గింపులను ఆఫర్ చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. 

స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఈ మోడళ్లపైనే..
* Samsung Galaxy M36 5G
* OnePlus Nord 5
* realme Narzo 80 Lite 5G
* iQOO 13
* Samsung Galaxy S24 Ultra
* iPhone 15
* iPhone 16 series
* Samsung Galaxy S25 series

పైన పేర్కొన్న మోడళ్లపై నో కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్లతో పాటు రూ.60వేల వరకు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. అయితే వేటిపై ఎంతెంత తగ్గింపులు ఉంటాయనే విషయాన్ని ఇప్పటి వరకు బయటపెట్టలేదు అమెజాన్ ఇండియా.

ఇదే క్రమంలో ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచీలపై కూడా అమెజాన్ అమేజింగ్ ఆఫర్స్ సిద్ధం చేస్తోంది. ఆపిల్, లెనోవో, హెచ్ పి, శాంసంగ్, వన్ ప్లస్ వంటి కంపెనీల ఉత్పత్తులపై 40 నుంచి 60 శాతం వరకు తగ్గింపులను అందించటానికి సిద్ధమైంది. అలాగే సోనీ, నాయిస్, బాస్ వంటి బ్రాండెడ్ కంపెనీల ఉత్పత్తులపై మంచి ఆఫర్లు ఉంటాయని తెలిపింది. 

టీవీలపై 65 శాతం డిస్కౌంట్స్..
ఇక టీవీల విషయానికి వస్తే దాదాపు 600 మోడళ్లపై 65 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని అమెజాన్ చెప్పింది. దీనికి అదనంగా మూడేళ్ల అదనపు వారెంటీ, నో కాస్ట్ ఈఎంఐ, ఇతర ఎక్స్ఛేంజ్ ఆఫర్లుంటాయని వెల్లడించింది. అలాగే వాషింగ్ మెషీన్లు, రెఫ్రిజరేటర్లు, ఎయిర్ కండిషనర్లు,వంట సామాగ్రిపై కూడా 65 శాతం వరకు తగ్గింపులు ఉండనున్నాయి. ఇందులో ప్రముఖ గృహోపకరణాల బ్రాండెడ్ కంపెనీలైన ఎల్ జీ, శాంసంగ్, హయర్, క్యారియర్ ఉత్పత్తులు ఆఫర్లలో అందుబాటులో ఉంటాయి. 

►ALSO READ | US Visa: స్టూడెంట్ వీసాదారులకు షాక్.. ట్రంప్ సర్కార్ ఆ నిర్ణయంతో కష్టాలే..

అలాగే అమెజాన్ ఉత్పత్తులైన ఎకో, ఫైర్ టివి, కిండిల్ పై 56 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. అలాగే ఇటీవల విడుదలైన కిండిల్ పేపర్ వైట్ పై రూ.3వేల తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ఇక ఆఫీస్ అవసరాల కోసం చేసే బల్క్ కొనుగోళ్లకు గరిష్ఠంగా 70 శాతం వరకు తగ్గింపులను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. 

ప్రస్తుతం అమెజాన్ తెస్తున్న ప్రైమ్ డే సేల్ కింద స్టేట్ బ్యాంక్, ఐసీఐసీఐ కార్డు హోల్డర్లకు ప్రత్యేక తగ్గింపులు ఉండనున్నాయి. అలాగే అమెజాన్ పే, అమెజాన్ పే లేటర్ కింద కొనుగోళ్లపై కూడా ఆఫర్లు, తగ్గింపులు ఉంటాయని కంపెనీ పేర్కొంది.