US Visa: స్టూడెంట్ వీసాదారులకు షాక్.. ట్రంప్ సర్కార్ ఆ నిర్ణయంతో కష్టాలే..

US Visa: స్టూడెంట్ వీసాదారులకు షాక్.. ట్రంప్ సర్కార్ ఆ నిర్ణయంతో కష్టాలే..

Student Visa: అమెరికా వెళ్లటం అక్కడ ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే మంచి కెరీర్ స్టార్ చేసి స్థిరపడాలి అనేది ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది యువతకు ఉండే కల. అయితే ఇది భారతదేశపు యువతలోనూ, ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలకు ఉండే లైఫ్ టైం డ్రీమ్. అందుకే పొలాలు, ఆస్తులు అమ్మైనా చాలా మంది తమ పిల్లలను అమెరికాకు పంపేందుతు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తల్లిదండ్రులు ఇష్టపడుతుంటారు. 

అయితే ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థులు నిరసనలు చేయటం వంటి వాటిపై ట్రంప్ సర్కార్ సీరియస్ గా ఉంది. ఈక్రమంలోనే అమెరికాకు వచ్చే విద్యార్థుల వీసా ప్రాసెసింగ్ ప్రక్రియను అత్యంత కఠినతరంగా మార్చటంతో పాటు వారి సోషల్ మీడియా ఖాతాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. 

ఈక్రమంలో అమెరికాకు విద్య కోసం వస్తున్న విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థులకు ఉన్న వీసా గడువు కాలాన్ని  తగ్గించాలని చూస్తోంది. దీనికి తోడు ఎక్స్ఛేంజ్ సందర్శకులు, విదేశీ సమాచార మీడియా ప్రతినిధుల బసకు అనుమతింటే కాలాన్ని తగ్గించాలని అమెరికా అధికారులు ప్రతిపాదించారు. ఇది అంతర్జాతీయ విద్యార్థులకు ఇబ్బందులను మరింతగా పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

►ALSO READ | సింధు జలాలపై దృఢంగా భారత్.. 'దుష్ట కుట్ర' అంటూ షెహబాజ్ షరీఫ్ నిస్సహాయత!

ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతిపాదనను అమెరికాలోని హోమ్ లాండ్ సెక్యూరిటీ ఆఫీస్ ఆప్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ విభాగానికి అందించింది. దీని ఉన్నతాధికారి నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి నేరుగా రిపోర్ట్ చేస్తారని సమాచారం. దీనిని కూడా అమలులోకి తీసుకొస్తే ఇప్పటికే ఉన్న యూఎస్ వీసా కష్టాలు మరింతగా ముదిరిపోతాయని వీసా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గతవారం భారతదేశంలోని అమెరికా ఎంబసీ కార్యాలయం విదేశీ విద్యార్థులతో పాటు యూఎస్ వీసా దరఖాస్తుదారులందరికీ తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను అందించటంతో పాటు వాటిని పబ్లిక్ చేయాలని వెల్లడించింది. ఈ వివరాలను దాచిపెట్టినా లేదా తప్పుడు సమాచారం పంచుకున్నా అమెరికా వీసా పొందటానికి వారు అనర్హులుగా మారతారని హెచ్చరించిన సంగతి తెలిసిందే.