
కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్‌బీ కాలనీలోని లులు మాల్లో ఈ నెల 3 నుంచి 6 వ తేదీ వరకు వివిధ వస్తువులపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. హైపర్‌మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, ఎలక్ర్టానిక్ విభాగాల్లోని దుస్తులు, ఫుట్‌వేర్, బ్యాగులు, యాక్సెసరీస్, స్పోర్ట్స్వేర్వంటి వాటిపై 50 శాతం డిస్కౌంట్ ఉంటుందన్నారు. టీవీలు, ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్ గ్యాడ్జెట్లు, గృహోపకరణాలపై ప్రత్యేక డీల్స్ ఉంటాయన్నారు.