Gold Rate: డాలర్ మాయాజాలం.. రోజురోజుకూ పెరుగుతున్న గోల్డ్ రేటు.. హైదరాబాదులో తులం..

Gold Rate: డాలర్ మాయాజాలం.. రోజురోజుకూ పెరుగుతున్న గోల్డ్ రేటు.. హైదరాబాదులో తులం..

Gold Price Today: వాస్తవానికి జూలై 9న అమెరికా ప్రకటించిన వాణిజ్య సుంకాలతో ఇచ్చిన బ్రేక్ ముగుస్తుండటంతో ఆందోళనలు తిరిగి స్టార్ట్ అయ్యాయి. అమెరికా కరెన్సీ డాలర్ ప్రస్తుతం ప్రమాదంలో ఉండటంతో బంగారం ధరలు తిరిగి పుంజుకుంటున్నాయి. బంగారం ధరలను డాలర్లలో ఫిక్స్ చేస్తుంటారు. అయితే డాలర్ బలహీనపటం ఇతర కరెన్సీల్లో దాని రేటు పెరుగుదలకు కారణమౌతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పసిడి ధరలు తిరిగి పుంజుకోవటం స్టార్ట్ అయ్యాయి. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.4వేల 500 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 065, ముంబైలో రూ.9వేల 065, దిల్లీలో రూ.9వేల 080, కలకత్తాలో రూ.9వేల 065, కేరళలో రూ.9వేల 065, పూణేలో రూ.9వేల 065, వడోదరలో రూ.9వేల 070, అహ్మదాబాదులో రూ.9వేల 070, జైపూరులో రూ.9వేల 080, మంగళూరులో రూ.9వేల 065, నాశిక్ లో రూ.9వేల 068, అయోధ్యలో రూ.9వేల 080, బళ్లారిలో రూ.9వేల 065, నోయిడాలో రూ.9వేల 080, గురుగ్రాములో రూ.9వేల 080 వద్ద కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.4వేల 900 భారీ పెరుగుదలను చూశాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 889, ముంబైలో రూ.9వేల 889, దిల్లీలో రూ.9వేల 904, కలకత్తాలో రూ.9వేల 889, కేరళలో రూ.9వేల 889, పూణేలో రూ.9వేల 889, వడోదరలో రూ.9వేల 894, అహ్మదాబాదులో రూ.9వేల 894, జైపూరులో రూ.9వేల 904, మంగళూరులో రూ.9వేల 889, నాశిక్ లో రూ.9వేల 892, అయోధ్యలో రూ.9వేల 904, బళ్లారిలో రూ.9వేల 889, నోయిడాలో రూ.9వేల 904, గురుగ్రాములో రూ.9వేల 904గా ఉన్నాయి.

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.90వేల 650 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.98వేల 890గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 20వేల వద్ద కొనసాగుతున్నాయి.