
HDFC Bank: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి తన కస్టమర్లకు కీలక అలర్ట్ జారీ చేసింది. 2025లో కొన్ని గంటల పాటు తన కస్టమర్లకు సేవల్లో అంతరాయం ఉంటుందని దీనికి ముందుగానే సిద్ధంగా ఉండాలని ప్రకటించింది. ఈ సమయంలో యూపీఐ చెల్లింపులు తాత్కాలికంగా పనిచేయవని కూడా సమాచారం ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే మెయింటెనెన్స్ కారణంగా జూలై 3 , 2025 అలాగే జూలై 4, 2025 నాడు కస్టమర్లు తమ సేవల నిలిపివేతను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగా జూలై 3 రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి జూలై 4 తెల్లవారుజామున 1 గంట 15 నిమిషాల వరకు అంటే 90 నిమిషాల పాటు సేవల్లో డౌన్ టైమ్ ఉంటుందని అలర్ట్ చేసింది.
బ్యాంక్ వెళ్లడించిన సమయంలో యూపీఐ చెల్లింపులు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మెుబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్ పే, వాట్సాప్ పే, పేటీఎం సహా ఇతర యూపీఐ చెల్లింపు యాప్స్ ద్వారా కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లు తమ ఖాతా నుంచి ఎలాంటి చెల్లింపులను చేయలేరని బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ సమయంలో రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ చెల్లింపుల్లో కూడా అంతరాయాలు ఉంటాయని బ్యాంక్ వెల్లడించింది.
►ALSO READ | ఈ నెలలోనే అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది : డిస్కౌంట్స్, ఆఫర్స్ లిస్ట్ ఇదే..!
బ్యాంక్ పైన పేర్కొన్న సమయంలో PayZapp వాలెట్ నుంచి చెల్లింపులు నిరంతరాయంగా చేసుకోవచ్చని చెప్పింది. అలాగే ఈ సమయంలో నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ చెల్లింపులు సాధారణంగానే పనిచేస్తాయని స్పష్టం చేసింది. అయితే జూలై 4 తెల్లవారుజామున 1.15 గంటల తర్వాత మాత్రం యూపీఐ సేవలు తిరిగి పునరుద్ధరించబడతాయని బ్యాంక్ చెప్పింది. అలాగే కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలను మెరుగుపరిచేందుకే ఈ మెయింటెన్స్ బ్రేక్ తీసుకుంటున్నట్లు ముందస్తు సమాచారంలో చెప్పింది బ్యాంక్.