
జ్యోతిష్యం ప్రకారం.. గ్రహాలు.. రాశులు.. గ్రహాల కదలికలు.. స్థాన చలనం ఆధారంగా వ్యక్తి జాతకాన్ని పండితులు నిర్దేశిస్తారు. జ్యోతిష్య నిపుణుల అంచనాల మేరకు జులై నెలలో కొన్ని గ్రహాల గమనంలో పెద్ద మార్పు ఉంటుందని చెబుతున్నారు. సూర్యుడు, బుధుడు, శని, శుక్రుడు , కుజుడు గ్రహాల్లో కొన్ని గ్రహాలు వాటి స్థానాన్ని మారగా.. మరి కొన్ని గ్రహాల గమన దిశను మార్చుకుంటున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవన పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తాయి. ఇప్పుడు ఆ రాసుల గురించి తెలుసుకుందాం. . .!
జూలై 2025 లో గ్రహాల స్థితిలో మార్పు ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. శని చెడు స్వభావంతో ...బుధుడు .. గురుడు తిరోగమనంగా సంచరించనున్నారు. దీని వలన ప్రజలు గందరగోళం .. మానసిక ఒత్తిడికి లోనవుతారని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం జూలై 13న మీనరాశిలో.. శని .... జూలై 16న సూర్యుడు కర్కాటకంలో సంచరిస్తాడు. జూలై 18న బుధుడు ..కర్కాటకంలో తిరోగమనంలో కదలడం ప్రారంభిస్తాడు. జూలై 26న శుక్రుడు ..మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు . జూలై 28న కుజుడు ...కన్యారాశిలోకి వస్తాడు. వీటి వలన ఈక్రింద రాసులకు చెందిన వారి జీవన విధానంలో మార్పులువస్తాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
మిథున రాశి : ఈ రాశి వారికి జులై నెలలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయని పండితులు చెబుతున్నారు. శని 10 వ ఇంట్లోకి బుధుడు ప్రవేశించడం వలన వ్యాపారస్తులకు ఆందోళనగా ఉంటుంది. ఈ రాశి వారు తలపెట్టిన పనులు చాలా నెమ్మదిగా జరుగుతాయి. ఉద్యోగస్తుల విషయంలో మీ పని మీరు చేసుకోండి.. మీకు అవసరంలేని వాటిని అస్సలు ప్రస్తావించవద్దు.. ప్రతి విషయాన్ని ఓపికతో ఆలోచించండి. ఓర్పు సహనం అవసరమని పండితులు సూచిస్తున్నారు. ప్రతి సోమవారం పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయండి.. కొంత ఉపశమనం కలుగుతుంది.
సింహ రాశి : ఈ రాశి వారికి జులై నెలలో గ్రహాల సంచారము అనుకూలంగా ఉండదు.కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జీర్ణక్రియ.. మలబద్ధకానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. . ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం వలన నష్టం తీవ్రత తగ్గుతుంది.
కన్య రాశి : శని తిరోగమనం వలన ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలుంటాయి. అనవసరమైన విషయాల జోలికి వెళ్లవద్దు. ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆరోగ్య పరంగా కూడా సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు. ప్రతి శనివారం శని భగవానుడికి నువ్వులనూనెతో అభిషేకం చేయండి.. కేజీంపావు నల్ల నువ్వులను దానం ఇవ్వండి.. శని భగవానుడు సంతృప్తి చెంది.. కీడు చేయడని పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి : ఈ రాశి వారు జు లై నెలలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కీలక విషయాల్లో నిర్ణయం తీసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అయినా నిరుత్సాహ పడకండి. అంతా మంచే జరుగుతుంది. వ్యాపారస్తులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ల దగ్గర డబ్బులు నిలవదు. ఎంత వచ్చినా అంతే స్థాయిలో ఖర్చు ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సు రాశి : ఈ రాశి వారికి జులై నెలలో గ్రహాల మార్పు వలన చాలా ఇబ్బందులుఉంటాయి. అనుకోని పరిస్థితుల్లో ధనస్సు రాశి వారికి స్థాన చలనం ఉంటుంది. విశ్రాంతి లేకుండా పని చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు వస్తాయి. ఈ రాశి వారికి మానసిక అశాంతి కలుగుతుంది. ఆర్థికపరమైన లావాదేవీలలో అతిగా నమ్మడం అనర్ధాలకు దారితీస్తుంది. గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఎటువంటి భావోద్వేగాలకు లోను కావద్దని పండితులు సూచిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.
గమనిక: పైన తెలిపిన స్టోరీలోని వివరాలు కొన్ని శాస్త్రాల ఆధారంగా నిపుణుల సూచించిన వివరాల ప్రకారం రూపొందించడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీ 6 ఉద్యోగులు కాని... యాజమాన్యం కాని ధృవీకరించలేదు. మీకు సంబంధించిన జ్యోతిష్యుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సూచన..!