భారత యార్కర్ కింగ్‎కు ఏమైంది..? ఇంగ్లాండ్‎తో రెండో టెస్ట్ కు బుమ్రా దూరం.. కారణమిదే

భారత యార్కర్ కింగ్‎కు ఏమైంది..? ఇంగ్లాండ్‎తో రెండో టెస్ట్ కు బుమ్రా దూరం.. కారణమిదే

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‎లో భాగంగా బర్మింగ్‎హామ్‎లోని ఎడ్జ్‎బాస్టన్ వేదికగా జూలై 2న రెండో టెస్ట్ ప్రారంభమైంది. తొలి టెస్ట్‎లో ఓడిన టీమిండియా..  రెండో టెస్టులో గెలుపే లక్ష్యంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. సాయి సుదర్శన్, శార్థుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రాను రెండో టెస్ట్ కు పక్కకు పెట్టింది. వీరి స్థానంలో ఆకాష్ దీప్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. స్టార్ బౌలర్ బుమ్రా స్థానంలో ఆకాష్ దీప్ జట్టులోకి వచ్చాడు. పని భారం కారణంగా ఐదు మ్యాచుల సిరీస్‎లో బుమ్రాను ఏవైనా మూడు మ్యాచులు మాత్రమే ఆడించాలని సిరీస్‎కు ముందే బీసీసీఐ డిసైడ్ అయ్యింది. 

లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఆడాడు. ఈ మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో సిరీస్ రేసులో నిలవాలంటే రెండో టెస్ట్‎లో తప్పక గెలవాలని.. ఇందు కోసం రెండో టెస్ట్‎లో బుమ్రాను ఆడిస్తారని ప్రచారం జరిగింది. ఫస్ట్ మ్యాచు, రెండో మ్యాచుకు మధ్య 8 రోజుల విశ్రాంతి రావడం కూడా కలిసి వస్తుందనుకున్నారు. మ్యాచుకు ముందు జట్టు మేనేజ్మెంట్ కూడా రెండో టెస్ట్‎కు బుమ్రా అందుబాటులో ఉంటాడని తెలిపింది. తీరా చూస్తే రెండో టెస్ట్ ప్లేయింగ్ లెవన్ జాబితాలో బుమ్రా పేరు లేదు. 

బుమ్రా స్థానంలో ఆకాష్ దీప్ జట్టులోకి వచ్చాడు. వర్క్ లోడ్, బుమ్రా ఆడే మ్యాచుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని రెండో టెస్ట్‎కు యార్కర్ కింగ్‎ను ఆడించనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మూడో టెస్ట్ మ్యాచు ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచుకు ప్రిపేర్ అయ్యేందుకే బుమ్రాను రెండో టెస్ట్‎కు పక్కకు పెట్టినట్లు టాక్.

►ALSO READ | IND VS ENG 2025: మ్యాచ్‌కు ముందు మౌనం పాటించిన ఇండియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు.. కారణమిదే!


ఐదు మ్యాచుల సిరీసులో తొలి టెస్ట్ ఆడిన బుమ్రా.. మిలిగిన నాలుగింట్లో ఏవైనా రెండు టెస్టుల మాత్రమే ఆడనున్నాడు. ఇందులో ఐకానిక్ లార్డ్స్ వేదికగా జరిగే మూడో టెస్ట్‎లో 99 శాతం బుమ్రా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా టాస్ ఓడింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇండియా తొలుత బ్యాటింగ్‎కు దిగింది. 

భారత్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI):
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్