బెంగళూరు ఇన్ఫోసిస్లో అంత మంచి జాబ్ చేస్తూ.. ఇంత నీచమైన పని ఎలా చేశాడో..!

బెంగళూరు ఇన్ఫోసిస్లో అంత మంచి జాబ్ చేస్తూ.. ఇంత నీచమైన పని ఎలా చేశాడో..!

బెంగళూరు: పేరుమోసిన ఐటీ కంపెనీలో ఉద్యోగం. మంచి పొజిషన్ కూడా. ఐదంకెల జీతం. అందమైన జీవితం. ఇంత మంచి స్థితిలో ఉన్న ఇతనికి ఎందుకీ పాడు బుద్ధి పుట్టిందో గానీ నీచానికి దిగజారాడు. మహిళా ఉద్యోగులు ఆఫీస్ వాష్ రూమ్స్ వాడుకుంటున్న సమయంలో వారికి తెలియకుండా సీక్రెట్గా వీడియోలు తీశాడు. ఒక మహిళా ఉద్యోగికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో ఇతగాడి నీచ కృత్యం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు ఇన్ఫోసిస్ ఆఫీస్లో నగేష్ స్వప్నిల్ మాలి అనే యువకుడు సీనియర్ అసోసియేట్గా పనిచేస్తున్నాడు. బయటకు అందరితో మంచిగా ఉంటూ కనిపించే నగేష్లో ఒక మృగం దాగి ఉందని తెలిసి సహోద్యోగులు షాకయ్యారు. ఒక మహిళా ఉద్యోగి వాష్ రూం యూజ్ చేసుకోవడానికి వెళ్లింది. తాను టాయ్లెట్ యూజ్ చేస్తున్న సమయంలో నగేష్ వీడియో రికార్డ్ చేస్తున్నాడని గుర్తించిన సదరు మహిళా ఉద్యోగి ఉలిక్కిపడింది.

►ALSO READ | ఆకస్మిక గుండెపోటు మరణాలకు..కోవిడ్ కారణం కాదు..అధ్యయనాల్లో వెల్లడి

వెంటనే.. అలారం ప్రెస్ చేయడంతో ఇతర ఉద్యోగులు అక్కడికి వెళ్లి నగేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నగేష్ ఫోన్ లాక్కుని చూడగా సదరు మహిళా ఉద్యోగి వాష్ రూం వీడియో అందులో ఉంది. ఆ మహిళ సమక్షంలోనే హెచ్ఆర్ విభాగం ఆ వీడియోను ఫోన్ నుంచి తొలగించింది. ఇది చిన్న విషయం కాదని.. నగేష్ మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్కు పంపించామని.. డిలీట్ అయిపోయిన కంటెంట్ను తిరిగి చూస్తే గానీ గతంలో కూడా ఇలా ఇతర మహిళల వీడియోలు తీశాడో.. లేదో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు నగేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.