హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..

హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు టౌన్ ప్లానింగ్ అధికారులు. అక్రమ నిర్మాణాలపై స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం ( జులై 1 ) కూల్చివేతలు చేపట్టారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనిలో రొహౌస్ లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై ఫిర్యాదులు అందటంతో కూల్చివెతలు చేపట్టారు అధికారులు. టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చేశారు.

ALSO READ | పొట్ట కూటి కోసం వచ్చి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధకరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టిన అధికారులు మరో నిర్మాణాన్ని కూల్చివేసేందుకు వెళ్లగా అందులో నివాసం ఉంటున్నామని.. ఒకరోజు సమయం ఇవ్వాలని కోరారు ఆక్రమణదారులు. దీంతో బుధవారం ( జులై 2 ) తెల్లవారుజామున ఆరు గంటల సమయానికి ఖాళీ చేయకపోతే ఎట్టి పరిస్థితిలో తొలగిస్తామని హెచ్చరించారు అధికారులు.

మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడితే తమ దృష్టికి తీసుకురావాలని..  అక్రమంగా నిర్మాణాలను గుర్తించి నెలమట్టం చేస్తామని తెలిపారు అధికారులు.