
ఈ మధ్య కాలంలో ఏఐ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అంతేకాకుండా దీని వినియోగం కూడా పెరిగింది. అయితే ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ మాత్రం అతను రూపొందించిన చాట్‌జీపీటీపై యూజర్లు ఎక్కువగా ఆధారపడకూడదని హెచ్చరించారు. ఒక ఓపెన్ ఏఐ పాడ్‌కాస్ట్లో అతను మాట్లాడుతూ ప్రజలు చాట్‌జీపీటీపై హై లెవెల్ నమ్మకాన్ని ఉంచడం తనకు ఆసక్తికరంగా అనిపించిందని అన్నారు. ఇంకా AI తప్పుదోవ పట్టించే విధంగా లేదా తప్పుడు సమాచారాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉందని చెబుతూ.. దానిని ఎక్కువగా నమ్మొద్దని ఆయన సూచించారు. "చాట్‌జీపీటీపై ప్రజలకు చాలా నమ్మకం ఉంది, ఇది చూస్తుంటే నిజంగా ఆసక్తికరంగా ఉంది నాకు, ఎందుకంటే AI మీరు అంతగా నమ్మలేని టెక్నాలజీ అది" అని ఆల్ట్‌మాన్ చాట్‌జీపీటీ గురించి చెప్పారు.
టెక్నాలజీ ఇంకా గోప్యతా సమస్యలు:
అయితే అతని పాడ్‌కాస్ట్ సమయంలో ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ చాట్‌జీపీటీ కొత్త ఫీచర్లతో అభివృద్ధి చెందుతున్నగాని టెక్నాలజీకి ఇప్పటికీ కొన్ని పరిమితులు, నియమాలు ఉన్నాయని, వాటిని పారదర్శకతతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని అంగీకరించారు.
కాపీరైట్ వివాదాలు:
ది న్యూయార్క్ టైమ్స్‌తో సహా మీడియా సంస్థల నుండి కంటెంట్ వాడకం అలాగే కాపీరైట్ సమస్యలపై ఓపెన్‌ఏఐ చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో సామ్ ఆల్ట్‌మాన్ ఈ విధంగా అన్నారు. ఈ ఆందోళనలకు ప్రతిస్పందనగా ఆల్ట్‌మాన్ తమ కంపెనీ కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. టెక్నాలజీ పై ప్రస్తుతం ఉన్న నమ్మకాన్ని ప్రస్తావిస్తూ ఇది అంతగా నమ్మదగినది కాదు అని కూడా ఒప్పుకున్నారు.
AI హార్డ్‌వేర్‌పై ఆల్ట్‌మాన్ యూ-టర్న్:
తాజాగా ఆల్ట్‌మాన్ AI హార్డ్‌వేర్ అవసరాలపై తన వైఖరిని మార్చుకున్నాడు. AI విప్లవానికి కొత్త హార్డ్‌వేర్ అవసరం లేదని ఆయన గతంలోనే పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుత కంప్యూటర్లు AI లేని ప్రపంచం కోసం రూపొందించబడ్డాయి అని చెప్పుకొచ్చారు. కృత్రిమ మేధస్సు మరింత ప్రబలంగా మారుతున్నందున వినియోగదారులకు కొత్త పరికరాలు అవసరమని సూచించారు. అతనితో పాటు జాక్ ఆల్ట్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్ ఇంకా హార్డ్‌వేర్ AI లేని ప్రపంచం కోసం రూపొందించబడ్డాయి అని తెలిపారు, ఈ మాటలు AI-ఆధారిత కోణంలో చూస్తే వినియోగదారుల అవసరాలు వేగంగా మారుతున్నాయని చూపుతుంది.