
ఇటీవల ఇళ్ళు, గుళ్ళు అన్న తేడా లేకుండా రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. ఇళ్లలో బంగారం దగ్గర నుంచి బయట వదిలిన షూస్, చెప్పులు కూడా వదిలిపెట్టకుండా ఎత్తుకెళ్తున్నారు. ఇక ఆలయాలను టార్గెట్ చేసుకున్న దొంగలు ఏకంగా విగ్రహాలనే దొంగలిస్తున్నారు.ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ శివార్లలో ఆలయాలే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ కమిషనరేట్ పరిధిలో ఆలయాల్లో పంచలోహ విగ్రహాలు చోరీ చేస్తున్న ముఠాను బుధవారం ( జులై 2 ) అదుపులోకి తీసుకున్నారు ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ సిసిఎస్ పోలీసులు.
దుండగులు ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో చోరీ చేసినట్లు గుర్తించారు. సిటీ శివార్లలోని దేవాలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుంచి రూ. 5 లక్షల 36 వేల 300 విలువజేసే పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు.
►ALSO READ | బెంగళూరు ఇన్ఫోసిస్లో అంత మంచి జాబ్ చేస్తూ.. ఇంత నీచమైన పని ఎలా చేశాడో..!
నిందితులు ఏపీ కి చెందిన శివానంద, షరీఫ్ దేవాలయాల్లో పంచలోహ విగ్రహాల చోరీలే కాకుండా ఉప్పల్ లో ఒక బైక్ కూడా దొంగలించినట్లు తెలిపారు పోలీసులు. నిందితులు మద్యం మత్తులో నేరాలు చేస్తున్నారని.. చోరీ చేసిన విగ్రహలు ఉప్పల్ కు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తి కి అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. నిందితులకు సహకరిస్తున్న క్రాంతి కుమార్ ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు.
నిందితులు నగర శివార్లలో సీసీ కెమెరాలు లేని దేవాలయాలనే టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ క్రమంలో ప్రతి దేవాలయంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పోలీసులు.