రిలీజ్ కి ముందే దేవర రికార్డ్ కలెక్షన్స్.. ఏకంగా అక్కడ అన్ని కోట్లు..

రిలీజ్ కి ముందే దేవర రికార్డ్ కలెక్షన్స్.. ఏకంగా అక్కడ అన్ని కోట్లు..

తెలుగులో ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ మరియు ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న  దేవర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా స్వర్గీయ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

దేవర పార్ట్-1 ఈ నెల 27వ తారీఖున ప్రేక్షకులముందుకు రాబోతోంది.దీంతో ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.  ఈ క్రమంలో దేవర చిత్రం విడుదలకి ముందే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవలే నార్త్ అమెరికాలో దేవర చిత్రానికి సంబంధించిన టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన అతికొద్ది సమయంలోనే రికార్డ్ స్థాయిలో 1 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. భారతీయ కరెన్సీలో చుస్తే ఈ చిత్రం విడుదలకి ముందే దాదాపుగా రూ.8.3 కోట్లు కలెక్ట్ చేసింది.

కాగా దేవర చిత్రంలో బాలీవుడ్, కోలీవుడ్ కి సంబంధించిన నటీనటులు కుడా ఉండడంతో ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. కాగా నార్త్ అమెరికాలో దేవర చిత్రం ఈ నెల 26వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది.