DevaraTrailer: దేవర ట్రైలర్ రిలీజ్..భయం, కోపం..ఓ భయంకరమైన విశ్వరూపం

DevaraTrailer: దేవర ట్రైలర్ రిలీజ్..భయం, కోపం..ఓ భయంకరమైన విశ్వరూపం

మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర (Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన టీజర్,సాంగ్స్ కూడా ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇక దేవర ట్రైలర్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కి..ఎన్టీఆర్ విశ్వరూపం చూసే ఆ సమయం వచ్చేసింది. 

తాజాగా దేవర సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ గూస్బంప్స్ అనేలా ఉంది. ఆద్యంతం ఈ ట్రైలర్ యాక్షన్‍తో నిండిపోయి ఉంది. దేవర ఆగ్రహంతో రక్త సముద్రం ప్రవహించేలా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు.ఆకాశం వణికిపోతోంది..అలలు ఎగసిపడుతున్నాయి..తుఫాను నుండి రక్తం కారుతోంది.అత్యంత ఘోరమైన రీతిలో క్రూరమైన మారణహోమానికి సంకేతం పలికారు దేవర మరియు వర. 

"ప్రతిసారీ..ఇది అతను సృష్టించిన చరిత్ర. కానీ ఈసారి అతను అన్ని ప్రాంతాలకు నోటీసు పంపుతున్నాడు..సిద్ధంగా ఉండండి. దేవర అనే ఊహాతీతమైన సునామీ బలంగా తాకుతుంది.తుఫాను యుద్ధాన్ని తెస్తుంది..దేవర విధ్వంసం తెస్తాడు" అని ట్యాగ్ చేస్తూ అంచనాలు పెంచారు మేకర్స్. చివరగా..“భయం, కోపం..ఓ భయంకరమైన విశ్వరూపం. దేవర నామసంవత్సరంలో చాలా గుర్తుండిపోయే ఓ మాస్ ట్రీట్ ఇది.

ఇప్పటికే సాంగ్స్ మిలియన్ల వ్యూస్ తో ట్రెండ్ సెట్ చేస్తున్న దేవర..ఇపుడు ఈ ట్రైలర్ తో ఎలాంటి సునామి వ్యూస్  క్రియేట్ చేయనుందో చూడాలి. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా రిలీజ్ కానుంది.