తారక్ ఎంట్రీతో.. ‘ఇండియా, అమెరికా మధ్య మరింత శక్తి బలోపేతం’ : US కాన్సులేట్‌ జనరల్ ట్వీట్

తారక్ ఎంట్రీతో.. ‘ఇండియా, అమెరికా మధ్య మరింత శక్తి బలోపేతం’ : US కాన్సులేట్‌ జనరల్ ట్వీట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. రాష్ట్రాలనే కాదు.. దేశ సరిహద్దులు దాటేసిన స్టార్ హీరో తారక్. ఇప్పటికే, ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఓవర్సీస్ మార్కెట్లో మంచి వసూళ్లు రాబట్టాయి. ఇదొక్కటే కాదు.. తనపై ప్రేమతో మన తెలుగు భాషని సైతం నేర్చుకున్న విదేశీ ఫ్యాన్స్ ఉన్నారు తారక్కి. అలాంటి తారక్కి సంబంధించిన ఓ న్యూస్ ఓవర్సీస్ ఫ్యాన్స్ని ఖుషి చేస్తుంది. వివరాల్లోకి 

మంగళవారం (సెప్టెంబర్ 16న) తారక్ హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్కు వెళ్లాడు. ఈ విషయాన్ని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ తన అఫీషియల్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. 

‘‘అమెరికా కాన్సులేట్‌‌కు వచ్చిన ఎన్టీఆర్‌‌‌‌ను స్వాగతించడం ఆనందంగా ఉంది. యూనైటెడ్‌‌ స్టేట్స్‌‌లో చిత్రీకరించనున్న తన కొత్త సినిమాలు.. ఉద్యోగాల కల్పనతో పాటు ఇండియా, అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నాయి” అని చెబుతూ ఎన్టీఆర్‌‌‌‌తో కలిసి దిగిన ఫొటోలను ఆమె షేర్ చేశారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ అమెరికా కాన్సుల్ జనరల్ లారా ట్వీట్ పై స్పందించారు. ‘అమెరికా కాన్సులేట్ లారా విలియమ్స్ అద్భుత మాటలకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం, మీతో సంభాషించడం ఆనందంగా ఉంది' అని ఎన్టీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఇరువురి ట్వీట్స్, ఫోటోలు సోషల్ మీడియాలోవైరల్గా మారాయి. ఈ క్రమంలో డైరెక్టర్ నీల్, డ్రాగన్ మూవీని అమెరికాలోనూ షూట్ చేయనున్నట్లు దీని ద్వారా స్పష్టమవుతోంది.

ఇకపోతే ఎన్టీఆర్ ఈ లేటెస్ట్ పిక్లో బాగా సన్నగా కనిపించాడు. యమదొంగ మూవీ టైంలో ఎలా ఉన్నాడో అలాగే సన్నగా మారిపోయాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే తారక్ జిమ్‌‌లో వర్కవుట్స్‌‌ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)