పర్యావరణ అనుకూల కార్ల వాడకాన్ని పెంచడానికి ఆటో కంపెనీ హ్యుండాయ్ డీలర్ జేఎస్పీ హ్యూండాయ్, నూరీ ట్రావెల్స్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కార్పొరేట్, లాజిస్టిక్స్ రంగాల కోసం హ్యుండాయ్ ప్రైమ్ ఎస్డీ, ప్రైమ్ హెచ్బీ సీఎన్జీ వెహికల్స్ ఫ్లీట్ ఉంది.
దీనిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ జేఎస్‌సీ హ్యూండాయ్‌లో శుక్రవారం హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజనల్ సేల్స్ హెడ్ అమిత్ కుమార్ సింగ్, నూరీ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ నబీల్ ప్రారంభించారు. అమిత్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎన్జీ వాహనాలు ఇంధన ఖర్చును తగ్గించడమే కాకుండా, కాలుష్య నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
