జూబ్లీహిల్స్, వెలుగు: ఐపీఎల్ టికెట్ల కోసం కొందరు జూబ్లీహిల్స్లోని సన్ టీవీ నెట్‌వర్క్స్ ఆఫీసుపైకి దూసుకువెళ్లారు. ఆఫీసులోకి బలవంతంగా చొరబడి సిబ్బందిని బెదిరించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మే 15న సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెం.82లోని ఫీనిక్స్ లిథాప్ బిల్డింగులోని 11వ అంతస్తులో ఉన్న సన్ టీవీ నెట్‌వర్క్స్ ఆఫీసుకు కూరెల్ల మహేశ్‌కుమార్ తన అనుచరులతో కలిసి వెళ్లాడు.
తనకు ఐపీఎల్ టిక్కెట్లు కావాలంటూ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగాడు. ఛానల్ హెడ్ కిరణ్‌ను కూడా బెదిరించాడు. దీంతో సన్ టీవీ నెట్‌వర్క్స్ జీఎం ఎ. బాలకృష్ణన్ మే 19న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
