జూబ్లీహిల్స్, వెలుగు: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలపై బోరబండ, మధురానగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేశారు.
ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉంటే మరోవైపు బోరబండ డివిజన్లోని సైట్ -3 లో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్ బీఆర్ఎస్కరపత్రాలను పంచుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఎన్నికల సంఘం అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసులు నమోదు చేశారు.
మధురనగర్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, ఎమ్మెల్సీ రాందాస్ స్థానిక ఓటర్లను ప్రభావితం చేసేలా పార్టీ చిహ్నాలు ప్రదర్శించారని ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో మధుర నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
