‘జూబ్లీహిల్స్’ సొసైటీని ఉత్తమంగా తీర్చిదిద్దుతం : చైర్మన్ అభ్యర్థి బొల్లినేని సీనయ్య

‘జూబ్లీహిల్స్’ సొసైటీని ఉత్తమంగా తీర్చిదిద్దుతం : చైర్మన్ అభ్యర్థి బొల్లినేని సీనయ్య

పంజాగుట్ట, వెలుగు: పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ అభ్యర్థి బొల్లినేని సీనయ్య తెలిపారు. పోటీలో ఉన్న గ్రోత్, గవర్నెన్స్ ప్యానెల్‌‌ సభ్యుల లిస్టును బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌‌లో రిలీజ్​చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీ సభ్యుల సంక్షేమం, మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా తమ స్వతంత్ర బృందం పనిచేస్తుందని తెలిపారు. పాత ప్యానెళ్లతో తమ సభ్యులకు  సంబంధం లేదన్నారు. 

జూబ్లీహిల్స్​సొసైటీని దేశంలోనే అత్యుత్తమ సొసైటీల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ ప్యానెల్‌‌లో పి.శ్రీనివాస్ రావు, ఎంఆర్సీ.నాయుడు, డా.అనిల్, జ్యోతి ప్రసాద్, ఆజాద్ బాబు, రమేశ్​బాబు, ఐ.ప్రవీణ్, అనిల్ రెడ్డి, వి.ప్రవీణ్ రెడ్డి, వినోద్ రెడ్డి, రత్నావళి సభ్యులుగా ఉన్నారన్నారు. మహిళా విభాగం నుంచి అరుణశ్రీ, శ్రావంతి రాజు, ఎస్సీ విభాగం నుంచి మురళీకృష్ణను నామినేట్ చేశామని పేర్కొన్నారు.